ఇందుకు కారణంగా చెప్పచ్చు. ఈ నేపధ్యంలో సొంతింటికు ఉత్సాహపడేవారు..చేతిలో ఉన్న డబ్బుతో కాకుండా హౌసింగ్ లోన్ తో ముందుకు వెళ్లాలనుకుంటున్నారు. ఈ నేపధ్యంలో హౌసింగ్ లోన్ ఎంత బ్యాంక్ లు ఇస్తాయి అనేది తెలుసుకుంటే దాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు.
హౌసింగ్ లోన్ ఎంత మేరకు ఇవ్వాలనేది బ్యాంకులు అప్లే చేసే వ్యక్తి ఆర్థిక పరిస్థితి, ఇప్పటికే తీసుకున్న రుణాలను చెల్లించిన తీరు ఆధారంగా నిర్ణయిస్తాయి.
సాధారణంగా అప్లై చేసే వ్యక్తి ఆదాయాన్ని బట్టి ఇంటి విలువలో 80శాతం దాకా రుణం ఇవ్వడానికి బ్యాంకులు సిద్ధంగా ఉంటాయి.
అలాగే ఇల్లు కొనబోయే ప్రాంతం, అప్లై చేసిన వారి వయసు, ప్రస్తుత నికర ఆదాయం, భవిష్యత్తులో ఆదాయం వృద్ధి తదితర అంశాల ఆధారంగా 100శాతం వరకూ రుణం లభించే అవకాశమూ ఉంది.
ఎంత మేరకు హౌసింగ్ లోన్ లభించొచ్చు అనేది తెలుసుకునేందుకు ఆన్లైన్లో అనేక వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకుల వెబ్సైట్లలోనూ చూడొచ్చు. అయితే, ఇందులో పేర్కొనే మొత్తానికీ, వాస్తవంగా బ్యాంకులు మంజూరు చేసే మొత్తానికీ తేడా ఉండే అవకాశం ఉంది
comments